Share News

గోదావరిలోకి నెట్టి స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:27 AM

ఒక యువకుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు నరసాపురం డీఎస్పీ డాక్టర్‌ జి.శ్రీవేద తెలిపారు.

 గోదావరిలోకి నెట్టి స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు

గోదావరిలోకి నెట్టి స్నేహితుడిని హతమార్చిన ఇద్దరి అరెస్టు

మద్యం మత్తులో జరిగిన వివాదమే కారణం

పాలకొల్లు అర్బన్‌, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): ఒక యువకుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు నరసాపురం డీఎస్పీ డాక్టర్‌ జి.శ్రీవేద తెలిపారు. గత నెల 26న ఒక యువకుడు కనిపించడం లేదని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదుపై విచారణ చేశామని, విచారణలో భాగంగా పోడూరు మండలం జిన్నూరుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గత నెల 30న జిన్నూరుకు చెందిన ముప్పర్తి జైసోల్‌(బొంబాయ్‌) మృతి కేసులో దర్యాప్తులో తన స్నేహితులే ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించామన్నారు.గత నెల 25న ముగ్గురు స్నేహి తులు కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ముగ్గురి మధ్య చిన్న వివాదం చెలరేగింది. జైసోల్‌ తమను కొట్టాడన్న కారణంతో మిగిలిన ఇద్దరు 26వ తేదీ రాత్రి చించినాడ బ్రిడ్జి నుంచి గోదావరిలోకి తోసేసి నట్టు డీఎస్పీ శ్రీవేద వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా జక్కంపూడి నాగసాయి కిషోర్‌, తంగెళ్ల వెంకటేశ్వర రావులు నిందితులుగా గుర్తించి సోమవారం అరెస్టు చేసినట్టు తెలిపారు. సోమవారం వీరిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చినట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో పాలకొల్లు పట్టణ సీఐ కోలా రజనీ కుమార్‌, ఎస్‌ఐ జి.పృధ్వీ, కానిస్టేబుల్స్‌ను డిఎస్‌పి అభినందించారు.

Updated Date - Feb 03 , 2026 | 12:27 AM