పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:25 AM
ఉండి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): బాలికను వేధించిన నిందితుడికి జీ విత కాలం కఠినగారా శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు. బాధి తరాలికి రూ.5.80 లక్షల భారీ పరిహారం నిందితుల నుంచి వసూలు చేసి చెల్లించాలని భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చినట్టు ఉండి ఎస్‌ఐ నజీరుల్లా తెలిపారు.
పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు
బాధితురాలికి రూ.5.80 లక్షల నష్టపరిహారం
ఉండి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): బాలికను వేధించిన నిందితుడికి జీ విత కాలం కఠినగారా శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు. బాధి తరాలికి రూ.5.80 లక్షల భారీ పరిహారం నిందితుల నుంచి వసూలు చేసి చెల్లించాలని భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చినట్టు ఉండి ఎస్‌ఐ నజీరుల్లా తెలిపారు. 2023లో దసరా సెలవుల నిమిత్తం స్వ గ్రామం వచ్చిన బాలిక(15)పై నల్లూరి నాగాంజనేయులు(23) పలుమార్లు లైంగికదాడికి పాల్పడటమే కాకుండా విషయం ఎవరికైనా చెబితే చంపే స్తానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితరాలు తిరిగి హాస్టల్‌కు వెళ్లిన తరువాత అనారోగ్యం బారిన పడటంతో వార్డెన్ ద్వారా విషయం వెలు గులోకి వచ్చింది. బాఽధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరం రుజువైంది. దీంతో భీమవరం పోక్సో కోర్టు న్యాయ మూర్తి బి.లక్ష్మీనారాయణ వాదనలు విన్నతరువాత నిందితుడిపై నేరం రుజువు కావడంతో నాగాంజనేయులుకు జీవితకాల కఠినగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారన్నారు.
యువతిని మోసగించిన యువకుడికి పదేళ్లు..
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్ళి చేసుకుంటా నని నమ్మించి వివాహేతర సంబంధాన్ని కొనసాగించి ఆపై పెళ్ళికి నిరాక రించి తప్పించుకు తిరుగుతున్నట్టు ఆ యువకుడిపై నేరం రుజువు కావ డంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా విధిస్తూ ఏలూరులోని 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ సోమ వారం తీర్పు చెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గుంచాల గ్రామం అంబికా థియేటర్ వద్ద నివాసం ఉండే సోమిరెడ్డి హరిబాబు (27)సత్రంపాడులోని శ్రీసాయి టవర్స్‌లో నివాసం ఉంటున్నాడు.ఏలూరు లోని ఒక ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తన నివాసానికి తీసుకెళ్లి లోబర్చుకున్నాడు.. ఆ తరువాత పెళ్ళికి నిరాకరించి తప్పించుకు తిరుగుతున్నాడు.కట్నం ఇస్తేనే పెళ్ళి చేసు కుంటానని లేదంటే ఫొటో మార్పింగ్ చేసి నెట్‌లో పెడతానని బెదిరిం పులకు పాల్పడ్డాడు. విసుగు చెందిన బాధితురాలు 2021 సెప్టెంబరు 6న ఏలూరు త్రి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి త్రి టౌన్ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు ఏలూరులోని ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. నిందితుడైన సోమిరెడ్డి హరిబాబుపై నేరం రుజువు కావడంతో పదేళ్ళ జైలు శిక్ష రూ.ఐదు వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున అప్పటి ఏపీపీ చింతమనేని రమేష్ వాదించగా అడిషనల్ పీపీ ఎం.కేధారి వాదనలు వినిపించారు.