Share News

ఎస్‌ఆర్‌పీ అగ్రహారం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:24 AM

ఎస్‌ఆర్‌పీ. అగ్రహారం పం చాయతీ కార్య దర్శి బీఎన్‌వీ. ఆనంద్‌ భూషణంను సస్పెండ్‌ చేస్తూ పంచాయతీ ఉన్నతా ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్‌ఆర్‌పీ అగ్రహారం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

కలిదిండి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యో తి):ఎస్‌ఆర్‌పీ. అగ్రహారం పం చాయతీ కార్య దర్శి బీఎన్‌వీ. ఆనంద్‌ భూషణంను సస్పెండ్‌ చేస్తూ పంచాయతీ ఉన్నతా ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కైకలూరు పంచా యతీ కార్యదర్శిగా పని చేస్తున్న సమ యంలో పంచాయతీ నిధులు రూ.24 లక్షల71వేల 226 దుర్వినియోగం జరి గినట్టు ప్రాథమికంగా వెల్లడి కావడం తో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసు కున్నారు. పంచాయతీ కమిషనర్‌ నుంచి సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలువడ గా వాటిని అమలు చేస్తూ డీపీవో అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Feb 03 , 2026 | 12:24 AM