మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా కావాలన్న పశ్చిమప్రాంత ప్రజల కల సాకారమైంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తం నాలుగు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడనుంది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి డొంక కదులుతోంది. భారీగా నిధుల దోపిడీ బహిర్గతమవుతోంది. ఆర్పీలు బోగస్ గ్రూపులు సృష్టించి పెద్దమొత్తంలో దోచుకున్న వ్యవహారంలో ఒక్కొక్కరి పాత్ర వెలుగు చూస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటర్లను అందజేసింది. ఇప్పుడు మళ్లీ ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు పూర్తికావస్తున్న సమయంలో రైతులకు సంకట పరిస్థితి నెలకొంది. భారీగా బేళ్లను నోబిడ్ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక అల్లాడుతున్నారు. వేలానికి చివరి రెండుమూడు రోజులు కావడంతో రైతులు పొదిలి పొగాకు కేంద్రానికి చెక్కులతో చేరుకొని నిరీక్షిస్తున్నారు.
గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యాలయంలో ఓ అధికారి పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘నేను మంత్రిగారి ఇలాకా’ అంటూ ఆయన కార్యాలయంలో అన్ని పనులను చక్కబెడుతున్నారు. ఈనెల 23న ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డులో గనులు శాఖ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఇరువురు మంత్రులు భూమిపూజ చేశారు.
మండల కేంద్రమైన పంగులూరు - ముప్పవరం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై ఏర్పడిన గోతులపై రాకపోకలు సాగించడం యిబ్బందిగా మారింది.
మంగళవారం సర్వే పురోగతిపై సమీక్షిస్తూ సర్వే పనిలో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రైతుల సంక్షేమమే ప్ర జా ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని పాత గోళ్లవిడిపి గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతన్నా సేవలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కరివేపాకు సాగు లాభాలబాట పట్టింది. మండలంలోని పసుపుగల్లు, ముండ్లమూరు, చింతలపూడి, తమ్మలూరు గ్రామాల్లో కిరివేపాకు సాగు చేసిన రైతులు లాభాల బాట పట్టారు.
రైతాంగాభివృద్ధికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.