ఒంగోలు టు మార్కాపురం.. జిల్లా రికార్డులు వచ్చేశాయ్...
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:33 PM
మార్కాపురం జిల్లాకు సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నీ కలెక్టరేట్‌కు చేరాయి.
మార్కాపురం జిల్లాకు సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నీ కలెక్టరేట్‌కు చేరాయి. ఒంగోలులో కొద్ది రోజుల క్రితమే వాటిని వేరు చేసి ఉంచారు. గురువారం సాయంత్రం 4200 రికార్డులను మార్కాపురం తరలించారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు 21 మండలాల నుంచి డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు, ఇతర సిబ్బంది కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఎవరి మండలాల రికార్డులను వారి ఆధీనంలోకి తీసుకుని కలెక్టరేట్లో సిద్ధం చేసిన గదిలో భద్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఇన్చార్జి సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి పర్యవేక్షించి అధికారులుకు సూచనలు చేశారు. - మార్కాపురం, ఆంధ్రజ్యోతి