ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో కర్నూలు మెడికల్ కాలేజీ టీమ్ రన్నర్స్‌గా నిలిచింది. 27వ మెడికల్, డెంటల్ అంతర్ కళాశాల పోటీల ఫైనల్లో కేఎంసీ 1-0 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
lokesh tour రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు గురువారం రాత్రి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో మంత్రి లోకేశ్ పాల్గొనున్నారు.
క్రీడలతో సత్సంబంధాలు ఏర్పడతాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. గురువారం అవుట్డోర్ స్టేడియంలో 44వ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్ అండ్ సెలక్షన్ నిర్వహించారు.
:ఇచ్ఛాపురంలో గురువారం పీర్లకొండ యాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మూడోవారం ఒడిశాలోని భువనేశ్వర్ తదితర ప్రాంతాలు, విశాఖ, హైదరాబాద్, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ప్రకృతి సేద్యాని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. ఎరువులు, పురు గుమందులు వాడకం లేని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తే ఆరోగ్య సమాజం ఏర్పాటుకానుందని భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్ హారీష్‌బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
జిల్లాలోని రణస్థలం, ఆమదాల వలస, కొత్తూరు తదితర ప్రాంతాల్లో విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌కు టీడీపీ కార్యకర్తలు గురువారం ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ప్రభుత్వ ఆదర్శ జూనియర్ కాలేజీలో జరిగే మెగా పేరెంట్‌టీచర్స్‌మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనున్నారు.
రుద్రవరం ఫారెస్టు రేంజ్ పరిధిలోని నల్లమలలో డిసెంబరు 1 నుంచి పులుల గణన ప్రక్రియ ప్రారంభించినట్లు గురువారం రేంజర్ ముర్తుజావలి తెలిపారు.
తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎలమంచిలి తులసీనగర్‌లోని జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ మువ్వల రాంబాబును విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.