పట్టణంలోని శ్రీనివాసనగర్ వద్ద సమస్యలను పరిష్కరించేందుకు రూ.5.5కోట్లతో వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే కోట్ల అన్నారు. ఈ మేరకు గురువారం పనులకు భూమి పూజ చేశారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు
పట్టణంలోని మెయిన్ బజార్‌లో వెంకటలక్ష్మి వస్త్ర దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దుకాణం నుంచి మంటలు ఎగిసిపడడంతో స్థానికులు పరిసరాల్లో ఉన్న వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తంగభద్ర జలాశయం ఫోర్‌షోర్ ఏరియాలో పూడికతో పాటు ఇసుక, ఐరన్‌ఓర్ ఖనిజ సంపద ఉందా..? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి..? అనే వాటిపై తక్షణం సర్వే చేయాలని తుంగభద్ర జలాల వినియోగంపై ఏర్పాటైన హైపవర్ కమిటీ(అత్యున్నతస్థాయి కమిటీ) నియమించిన సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని ప్రవేశపెట్టాయి.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను క్రమం తప్పకుండా సేకరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,04,37,906 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ సిద్ధంగా ఉందని జిల్లా పరిషత్ సీఈఓ ఆర్. సుధాకర్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్ పేపర్‌తో పాటు ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిందన్నారు.
నంద్యాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
మహానంది క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.15 కోట్ల వ్యయంతో 50 వసతిగృహాలను నిర్మించనున్నట్లు టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ తెలిపారు.