డీసీఎంఎస్ సంస్థకు మహర్దశ
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:02 AM
కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎ్‌స)కు మహర్దశ పట్టింది. ఈసంస్థకు జవసత్వాలు కల్పించేందుకు ఆ సంస్థ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ చర్యలు చేపట్టారు. పాత భవనం స్థానంలో అధునాతన షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు రూ.10కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు నివేదికను అందజేశారు.
రూ.10 కోట్లతో అధునాతన భవనం
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎ్‌స)కు మహర్దశ పట్టింది. ఈసంస్థకు జవసత్వాలు కల్పించేందుకు ఆ సంస్థ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ చర్యలు చేపట్టారు. పాత భవనం స్థానంలో అధునాతన షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు రూ.10కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు నివేదికను అందజేశారు. మంత్రి నుంచి ఆమోదం లభించిందని, నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని డీసీఎంఎస్ మేనేజర్ రాజేష్ తెలిపారు. అదే విదంగా సంస్థకు మార్క్‌ఫెడ్ నుంచి రూ.2కోట్ల దాకా బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలు సత్వరమే మంజూరైతే ప్రగతిబాట పట్టించేందుకు అవకాశాలు ఉంటాయని ఇటీవలే నాగేశ్వరరావు యాదవ్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సానుకూల వైఖరి సీఎం ద్వారా వ్యక్తమైనట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు లేక పాతభవనంలో మగ్గిపోతున్న నగరంలోని డీసీఎంఎస్ కార్యాలయ భవనానికి పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.