Share News

కేసీ నీటిని వినియోగించుకోవాలి: సీఈ

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:26 PM

కేసీ ఆయ కట్టు రైతులు హంద్రీనీవా నుంచి, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి కేసీకెనాల్‌కు విడుదల చేస్తున్న నీటిని సద్వినియోగించుకోవాలని హంద్రీనీవా సీఈ కబీర్‌, ఎస్‌ఈలు పాండురంగయ్య, బాల చంద్రారెడ్డి రైతులకు సూచించారు.

కేసీ నీటిని వినియోగించుకోవాలి: సీఈ
నీటి పంపింగ్‌ను పరిశీలిస్తున్న సీఈ కబీర్‌ తదితరులు

నందికొట్కూరు రూరల్‌, ఫిబ్రవరి11.(ఆంధ్రజ్యోతి) : కేసీ ఆయ కట్టు రైతులు హంద్రీనీవా నుంచి, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి కేసీకెనాల్‌కు విడుదల చేస్తున్న నీటిని సద్వినియోగించుకోవాలని హంద్రీనీవా సీఈ కబీర్‌, ఎస్‌ఈలు పాండురంగయ్య, బాల చంద్రారెడ్డి రైతులకు సూచించారు. బుధవారం నందికొట్కూరు మండలంలోని మల్యాలవద్ద గల హంద్రీ నీవా ఎత్తిపోతలను, అలాగే ముచ్చు మర్రి ఎత్తిపోతలను, కేసీ కెనాల్‌కు నీటి విడుదలను సీఈ కబీర్‌, ఎస్‌ఈ బాలచంద్రారెడి, పాండురంగయ్య పరిశీలించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నీటిమట్టాన్ని పరిశీలించారు. అలాగే కేసీ కెనాల్‌ కట్ట పటిష్టతను కూడా పరిశీలించారు. సుంకేసుల నుండి 120 కిలోమీటర్ల దాకా కేసీ కెనాల్‌ కట్టను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నీటిని సకాలం లో విడుదల చేశాం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని, వృథా చేయ కూడదని అన్నారు. పంట కోతలు పూర్తయ్యో వరకు నీరివ్వాలని కోరా రు. ఈ కార్యక్రమంలో డీఈ ప్రసాద్‌ ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 11:26 PM