Share News

భక్తులను గౌరవించాలి: ఎస్పీ

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:22 PM

మల్లన్న దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులను గౌరవించడం పోలీసుల తొలి కర్తవ్యమని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సాయుధ బలగాల సిబ్బందికి దిశనిర్దేశం చేశారు.

భక్తులను గౌరవించాలి: ఎస్పీ
సాయుధ బలగాలకు సూచనలిస్తున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

శ్రీశైలం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మల్లన్న దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులను గౌరవించడం పోలీసుల తొలి కర్తవ్యమని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సాయుధ బలగాల సిబ్బందికి దిశనిర్దేశం చేశారు. బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక బందోబస్తు విధులకు వచ్చిన స్పెషల్‌ పార్టి, ఆర్మ్‌డ్‌, రిజర్వ్‌ సిబ్బంది, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల నుంచి ప్రత్యేక పోలీస్‌ సిబ్బంది, సుమారు 180 మంది సాయుధ బలగాల ప్రత్యేక సిబ్బందికి విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. శివదీక్ష పాదయాత్ర భక్తులు సుదూర ప్రాంతాల నుంచి దైవదర్శనానికి వస్తున్నారని, వారితో సహనంతో మాట్లాడాలని సూచించారు. వీలైనంత వరకు సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలని సూచించారు. రద్దీకి అనుగుణంగా కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే విధులు నిర్వహించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగవచ్చన్న అనుమానం వచ్చినపుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్ర మంలో డీఎస్పీ రామాంజినాయక్‌, సీఐ జీవన్‌గంగనాథ్‌ బాబు, రిజ ర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్‌, బాబు, ఎస్‌ఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 11:22 PM