Share News

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలి

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:31 PM

విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్‌ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా.సిరి అధికారులను ఆదేశించారు.

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలి
జాతీయ నులి పురుగుల నివారణ దినం పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్‌ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం జాతీయ నులిపురుగుల నివారణ దినం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1-19 సంవత్సరాలలోపు విద్యార్థులందరి చేత నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని విద్యాశాఖ అధికారులను, ఐసీడీఎస్‌ పీడీని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, ఐటీఐ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరి చేత అల్బెండజోల్‌ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలల సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలు, జువైనెల్‌ జస్టిస్‌ చట్టం-2015 ప్రకారం సక్రమంగా పని చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నాలుగు బాలల సంరక్షణ కేంద్రాలను ఆమోదం తెలిపామన్నారు. డీఎంహెచ్‌వో భాస్కర్‌ రాజు, ఐసీడీఎస్‌ పీడీ విజయ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రయీస్‌ ఫాతిమా, సీపీవో భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 11:31 PM