Share News

మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:20 PM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేయ నున్నట్లు నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాథ్‌ తెలిపారు.

 మహానందిలో మహాశివరాత్రి  బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
మహానందిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్డీవో విశ్వనాథ్‌

మహానంది, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేయ నున్నట్లు నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాథ్‌ తెలిపారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి విశ్రాంతి భవనంలో బుధవారం మహానంది దేవసానం ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెండో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారుల హాజరయ్యారు. ఆర్డీవో మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఏఎస్పీ మందాజావళి మాట్లాడుతూ వందమంది పోలీసు సిబ్బందితో ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిఘా ఉంచుత ామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న మాట్లాడుతూ భక్తుల కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవో మాట్లాడుతూ ప్రత్యేక క్యూలైన్‌లలో భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, పాలు అందిస్తామని తెలిపా రు. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. అలాగే ఉచిత ప్రసాదం అందజేస్తామన్నారు. లింగోద్భవ సమయంలో ముందస్తుగా నిర్ణయించిన వారిని మాత్రమే అనమతినిస్తామని తెలిపారు. వీఐపీ దర్శనాలు రద్దు చేస్తామని చెప్పారు. భక్తుల కోసం ఆలయ పరిసర ప్రాం తాల లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. అనంతరం ఆర్డీవోతో పాటు అధికారులందరూ ఏర్పాట్లను పరిశీలిం చారు. ఏఈవో మధు, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో మహమ్మద్‌దౌలా, ఇంటిలిజెన్స్‌ డీఎస్పీ వెంకటే శ్వర్లు, రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ ఏఈ ప్రభాకర్‌రెడ్డి, ఆలయ సిబ్బంది, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 11:21 PM