జీజీహెచ్‌లో సీడీ4 ల్యాబ్ ప్రారంభం
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:03 AM
ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌లో అత్యాధునిక సీడీ4 ల్యాబ్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ డా.రేణుకాదేవితో కలిసి ప్రారంభించారు.
కర్నూలు హాస్పిటల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌లో అత్యాధునిక సీడీ4 ల్యాబ్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ డా.రేణుకాదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ విభాగంలో ఉన్న సీడీ-4 ల్యాబ్‌ను న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌కు తరలించి అత్యాధునిక సౌకర్యాలు కల్పించామన్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్ రోగులకు సీడీ-4 కౌంట్‌తో వ్యాధి తీవ్రతను గుర్తిం చి తద్వారా మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. హెచ్‌ఐవీ రోగులకు సీడీ-4 కౌంట్ ఎంతో కీలకమన్నారు. రోగులకు తక్కువ సమయంలోనే రిపోర్టులు రావడం వల్ల తద్వారా చికిత్సలు వేగవంతమవుతాయన్నారు. జనరల్ మెడిసిన్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా.సోమప్ప, కర్నూలు ఏఆర్‌టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డా.ఉదయిని పాల్గొన్నారు.