జగన్పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదంటూ మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు.
కోర్టుకు వెళ్లే సమయంలో అంత ఆర్భాటం అవసరమా అంటూ జగన్పై మాజీ ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయ జీవితం చరమాంక దశకు చేరుకుందన్నారు.
రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు.
నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయం, సమాచారం శాస్త్ర విభాగం, ఎన్డీఎల్ఐ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రంథా లయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది.
యువత మొబైల్ వాడకం సమయం తగ్గించుకుని సృజనాత్మకతను పెంచే అంశాల వైపు దృష్టి సారించాలని జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ (అడ్మినిసే్ట్రటివ్) కేజీవీ సరిత హితవు పలికారు.
జగన్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయస్థానాలకు రాకుండా కుంటిసాకులతో వాయిదా వేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు.
మావోయిస్టు అగ్రనేతలను కోర్టులో హాజరుపర్చాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దేవజీ, రాజిరెడ్డి తమ వద్ద లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు.
రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకూడదని.. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీ శా కోరారు. పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్లమెంట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభకానున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతించాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు.. నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు కష్టించి పండించిన ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.