వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ABN , Publish Date - Feb 14 , 2026 | 10:55 AM
ఏపీ అసెంబ్లీని ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు వీక్షించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 14: విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(AP Assembly Speaker Ayyanna Patrudu) వెల్లడించారు. శనివారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో స్పీకర్ మాటామంతి నిర్వహించారు. ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు అసెంబ్లీని వీక్షించారని సభాపతి తెలిపారు. మరో రెండు రోజుల్లోనే 200లకు పైగా పాఠశాలల నుంచి దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీని చూసిన కొంతమంది విద్యార్థులు.. తాము భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవుతామనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారని స్పీకర్ ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్లు, ఇంజినీర్లు కావడమే కాకుండా నేటితరం విద్యార్థులు రాజకీయాలపై ఆలోచించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు. పాఠశాలల్లో మాక్ అసెంబ్లీల నిర్వహణ పెరగడం శుభపరిణామమని స్పీకర్ కొనియాడారు.
గత రాత్రి మంత్రి నారా లోకేశ్‌తో(Minister Nara Lokesh) జరిగిన సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగిందని చెప్పారు. అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా సరదాగా గడిపామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పాటించే డైట్ పాటిస్తే ఎవరైనా బరువు తగ్గిపోతారని తెలిపారు. మంత్రి లోకేశ్ ఇప్పటికే బాగా తగ్గారని, ఇంకా ఎక్కువ తగ్గొద్దని సూచించానని స్పీకర్ వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఎక్కువగా బరువు తగ్గారని, అది మంచిది కాదని హెచ్చరించానని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి...
ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?
బడ్జెట్ ప్రతులతో కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
Read Latest AP News And Telugu News