Share News

ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదా సంభాషణ

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:48 PM

అసెంబ్లీ లాబీలో పలువురు ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదాగా సంభాషించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును డాకూ మహారాజ్ అని పిలిచారు బాలయ్య.

ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదా సంభాషణ
MLA Balakrishna

అమరావతి, ఫిబ్రవరి 12: ఏపీ అసెంబ్లీ లాబీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) సందడి చేశారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బొజ్జల సుధీర్, ఎం.ఎస్. రాజు తదితరులతో బాలకృష్ణ సరదాగా సంభాషించారు. ఎంఎస్ రాజును 'డాకూ మహారాజ్' అని పిలిచారు బాలయ్య. హంద్రీనీవా నీటిని హిందూపురానికి కాదని మడకశిర తీసుకుపోతున్నారని, అందుకే రాజు 'డాకూ మహారాజ్' అయ్యారంటూ బాలకృష్ణ జోక్ చేశారు. దీనికి స్పందించిన ఎంఎస్ రాజు.. వెనుకబడిన ప్రాంతమైన మడకశిరకు నీటి అవసరం ఎక్కువగా ఉందని.. పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. అందుకు బాలకృష్ణ సానుకూలంగా స్పందిస్తూ, హిందూపురం ప్రజలతో పాటు మడకశిర ప్రజలూ బాగుండాలని చెప్పారు. హిందూపురానికీ నీటి అవసరం ఉందని బాలయ్య వివరించారు.


అసెంబ్లీకి ప్రతిపక్షం రాలేదా? అని ఎమ్మెల్యేలతో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి వచ్చి 11 నిమిషాల్లో 11 మంది వెళ్లిపోయారని ఎమ్మెల్యేలు చెప్పారు. తదుపరి సినిమా ఏంటని ఎమ్మెల్యేలు ఆరా తీయగా.. మలినేని గోపీచంద్‌తో మంచి కథ కుదిరిందని బాలకృష్ణ వెల్లడించారు. త్వరలోనే ఆ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, బాలకృష్ణ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి...

ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్‌ కసిరెడ్డి రెగ్యులర్ బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ

అమరావతి రాజధాని కాదు.. ఆంధ్రప్రజల భవిష్యత్: ఎమ్మెల్యే వెంకట్రాజు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 05:35 PM