లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు.. వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:36 PM
లిక్కర్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
విజయవాడ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం నాడు ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. అలాగే వీరి బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
మరోవైపు.. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎక్సైజ్ కోర్టులో అధికారులు నేడు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఎక్సైజ్ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంబటికి మళ్లీ రిమాండ్.. సెంట్రల్ జైలుకు తరలింపు
నా పక్కన పైరవీకారులు లేరు.. ఉద్యమకారులే ఉన్నారు: కవిత
For More AP News And Telugu News