• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

కలివిడిగా.. కాజేశారు

కలివిడిగా.. కాజేశారు

రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. స్వలాభాన్ని సాధ్యం చేసుకోడానికి జలవనరుల శాఖలో రెండు చేతులు కలిశాయి. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు ఒక్కటయ్యారు. వేర్వేరుగా చేయాల్సిన పనులను కమీషన్ల కోసం ప్యాకేజీలుగా చేసుకున్నారు. వేర్వేరుగా పనులు చేస్తే మిగిలేదేం ఉండదని గ్రహించిన కాంట్రాక్టర్లు తమ ప్రాబల్యంతో అధికారులను కమీషన్ల ముగ్గులోకి దించారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలేశారు.

సాహో.. పారిశ్రామిక

సాహో.. పారిశ్రామిక

జిల్లాలో పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటు, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో బిజినెస్‌ మీట్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సును దృష్టిలో ఉంచుకుని జిల్లాస్థాయిలో కూడా ఆ తరహాలో మీట్‌ జరగాలని ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రమాదానికి దారులు

ప్రమాదానికి దారులు

జిల్లాలోని రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అడుగుకో గొయ్యితో అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. కనీస మరమ్మతులైనా చేయండి మహాప్రభో.. అంటూ ప్రజలు వేడుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కొద్దిపాటి వర్షం కురిస్తే రహదారులపై వర్షపునీరు నిలిచి ఎక్కడ గోతులున్నాయో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారులు 2,786.50 కిలోమీటర్ల మేర ఉండగా, సగానికి పైగా గోతులమయంగానే ఉండటం గమనార్హం. - ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం

AP High Court: పరకామణి చోరీ కేసు.. జర్నలిస్టు భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: పరకామణి చోరీ కేసు.. జర్నలిస్టు భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు

పరకామణి చోరీ కేసులో జర్నలిస్టు శ్రీనివాసులుకు భద్రత కల్పించాలంటూ తిరుపతి ఎస్పీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది.

AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. వారం రోజుల్లో

AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. వారం రోజుల్లో

ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈనెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ వెల్లడించింది.

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

రాజధాని అమరావతి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ భేటీ అయ్యింది. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెల్లడించారు.

భయోమెట్రిక్‌

భయోమెట్రిక్‌

పాత ప్రభుత్వాసుపత్రిలో సరైన సదుపాయాలు లేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ప్రసవమై.. శిశువు జన్మించిన ఎనిమిది రోజులకు బాలింత.. బిడ్డతో కలిసొచ్చి ఆరోగ్యమిత్ర వద్ద బయోమెట్రిక్‌, ఫొటో తీయించుకోవాలి.

నిడమానూరు డబుల్‌ డెక్కర్‌పై  నీలినీడలు

నిడమానూరు డబుల్‌ డెక్కర్‌పై నీలినీడలు

నిడమానూరు జంక్షన్‌-మహానాడు జంక్షన్‌ వరకు ఎన్‌హెచ్‌-16పై ప్రతిపాదించిన డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన 7 కిలోమీటర్ల నాలుగు వరసల ఫ్లై ఓవర్‌ ప్రతిపాదన ఉపసంహరణ దిశగా ఆ ఆలోచనలు ఉన్నాయి.

వర్షాందోళన

వర్షాందోళన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దివి రైతులు ఆందోళన చెందుతున్నారు.

AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ పిటిషన్‌పై హైకోర్టు ఏం తేల్చిందంటే..

AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ పిటిషన్‌పై హైకోర్టు ఏం తేల్చిందంటే..

మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం బంధువులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు మూసివేసింది. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి