Share News

చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిది: భువనేశ్వరి

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:40 PM

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిదని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు..

చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిది: భువనేశ్వరి
Bandla Ganesh

అమరావతి, ఫిబ్రవరి 14: తిరుమలకు చేపట్టిన ‘సంకల్ప యాత్ర’ పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) కుటుంబసమేతంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని (Bhuvaneshwari) కలిశారు. ఈ విషయాన్ని భువనేశ్వరి సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ చూపిన అభిమానం మరువలేనిదని భువనేశ్వరి పోస్టు చేశారు.


భువనేశ్వరి ట్వీట్..

‘సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్.. కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన చూపిన అభిమానం మరువలేనిది. ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.


కాగా, సంకల్ప పాదయాత్రను బండ్ల గణేశ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 19న తెలంగాణలోని షాద్‌నగర్‌‌లో ప్రారంభమైన ఈ 'సంకల్ప యాత్ర' 23 రోజుల్లో సుమారు 535-537 కిలోమీటర్ల మేర సాగింది. ఫిబ్రవరి 10న తిరుమల చేరుకున్న బండ్ల గణేశ్.. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. ఈ యాత్రను 2023లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సమయంలో మొక్కుకున్న మొక్కుగా బండ్ల గణేశ్‌ తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చి అధికారం చేపడితే.. పాదయాత్ర చేస్తానని సంకల్పం చేశారు బండ్ల గణేశ్. ఆ మొక్కు తీరినందుకు భక్తిభావంతో ఆయన ఈ యాత్రను పూర్తి చేసి, తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా భక్తితో నడిచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నందుకు బండ్ల గణేశ్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ నా జన్మలో ఇది గొప్ప ఘట్టం. ఈ జన్మంతా శ్రీవారికి సేవ చేస్తాను’ అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ బడ్జెట్‌లో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ప్రస్తావన

ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగం: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 04:42 PM