రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:46 AM
ఏపీ అసెంబ్లీలో రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 14: ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. 11.75 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. 2026-27వ ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2026-27 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు.
2025-26వ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో దేశం శక్తిమంతంగా ఉందనే గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో సాధించడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని చెప్పాలన్నారు. దేశ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ రాజీ పడదని మోదీ గట్టి సంకేతాలు ఇచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
మొత్తం బడ్జెట్ : రూ.3,32,205 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ. 2,56,143 కోట్లు
మూలధన వ్యయం : రూ. 53,915 కోట్లు
రెవెన్యూ లోటు : రూ. 22,002 కోట్లు
ద్రవ్య లోటు : రూ. 75,868 కోట్లు
ఇవి కూడా చదవండి...
బడ్జెట్ ప్రతులతో కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
Read Latest AP News And Telugu News