రిలయెన్స్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది.
చిన్నారులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు బాగా చదవుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.
పత్తి రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట దిగుబడిపై అధిక వర్షాలు, మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపాయి. చేతికొచ్చిన కొద్దోగొప్పో పంటను అమ్ముకునే తరుణంలో రైతులను యాప్స్ కష్టాలు వెంటాడుతున్నాయి. కాస్త పత్తిని అమ్ముకుని, పెట్టుబడి ఖర్చులైనా దక్కించుకుందామనుకుంటే ఈ యాప్స్ ఇబ్బందులు మరింత తలనొప్పిగా పరిణమించాయి. పోనీ బయట అమ్ముకుందామంటే.. దళారులు కష్టాన్ని దోచుకునేందుకు చూస్తున్నారని, తక్కువకు అడుగుతున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ గేర్ మార్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ పోటీని తట్టుకోవటానికి ప్రజల వద్దకే హయ్యండ్ బస్సులు తీసుకెళ్లాలని భావిస్తోంది. పండిట్ నెహ్రూ బస్టేషన్ (పీఎన్బీఎస్)పై రద్దీని తగ్గించటానికి, ప్రజలు కోరుకున్న చోట బస్సులు ఆపటానికి వీలుగా శాటిలైట్ బస్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత ్మకంగా ఆటోనగర్, ఉయ్యూరు బస్టేషన్లను ఇలా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా మొగల్రాజపురం వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న క్రీడా వేడుక స్పోర్ట్స్ - ఎ -థాన్ గురువారంతో ముగిసింది.
యువత ఆరోగ్యవంతమైన జీవితం గడిపితేనే బంగారు భవిష్యత ఉంటుందని జిల్లా ఈగల్ విభాగం అధికారి ఎం.వీరాంజనేయులు తెలిపారు.
నకిలీ మద్యం తయారీ, సరఫరా కేసులో నిందితులైన జోగి రమేశ్, అద్దేపల్లి జనార్దన్ రావుల రిమాండ్ను ఈనెల 25 వరకు పొడిగించింది న్యాయస్థానం. వీరిపై ఉన్న పోలీస్ కస్టడీ పిటిషన్ల విచారణను ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
కుప్పం నియోజకవర్గంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.. కిట్టయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఏనుగుల సంచారంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రతీ వీఐపీ బాధ్యత తమదే అని పేర్కొన్నారు.
ఐదేళ్ల తర్వాత రీన్యూ పవర్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్లో ప్రకటించారు.