Home » Andhra Pradesh » Guntur
ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయిప్రసాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2026 మార్చి ఒకటో తేదీ నుంచి సాయిప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఎంపీలతో శుక్రవారం సమావేశమయ్యారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు గురువారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు.
మంగళగిరి పట్టణం శివాలయం సమీపంలో రూ. 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి ఆయన శంకుస్థాపన చేశారు.
మూడు జిల్లాలతోపాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ అయింది.
ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ పని చేసిన సమయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందజేసింది. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.