• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

రైతన్నా.. మీకోసం

రైతన్నా.. మీకోసం

రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రేణిగుంట మండలం గాజులమండ్యంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరంలో పలు పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రతి పథకం రైతు ఇంటి వద్దకు చేరేలా ఈనెల 29వ తేదీ వరకు గ్రామ సచివాలయ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలో 20 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 12,500 టన్నులు పంపిణీ చేశామన్నారు. కనీసం మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున రెండు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు. కూలీల కోరతను తగ్గించేందుకు సీహెచ్‌సీల ద్వారా తక్కువ ఖర్చుతో యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. డ్రోన్‌ సాయంతో ఎకరాకు 6 నిమిషాల్లో ఎరువుల పిచికారీ పూర్తి చేయవచ్చన్నారు. మామిడి, వేరుశనగ పంటలకు డ్రిప్‌, స్ర్పింక్లర్లును రాయితీపై అందిస్తున్నామన్నారు. ఏ పంట వేసేదీ ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టర్లో నమోదు చేసి పంట బుకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఆర్డీవోలు భానుప్రకా్‌షరెడ్డి, ప్రసాదరావు, ఏవో సునీల్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, రెవెన్యూ, మత్స్య శాఖ, సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నేడే పంచమి తీర్థం

నేడే పంచమి తీర్థం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) మంగళవారం జరగనుంది. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని, చక్రత్తాళ్వార్‌ను ఆలయం నుంచి వేంచేపుగా పంచమితీర్థం మండపానికి తీసుకురానున్నారు. పది గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు.. అభిజిత్‌ కుంభ లగ్నంలో చక్రత్తాళ్వార్‌ను అర్చకులు పుష్కరిణిలో మునక వేయించనున్నారు. ఆ తర్వాత భక్తులు పుష్కరిణి స్నానాలను ఆచరించనున్నారు. లక్ష మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు.

సమస్యలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు

సమస్యలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు

లో ఓల్టేజ్‌.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం’ అని సదరన్‌ డిసం్క సీఎండీ శివశంకర్‌ తెలిపారు. తిరుపతిలోని సదరన్‌ డిస్కం కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిస్కం పరిధిలోని 65 మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో సిబ్బంది నిర్లక్ష్యం జరుగుతోందని, అనతికాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు. డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చే చిన్న సమస్యలతో పాటు పెద్దవీ త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని చెప్పారు.

సింగపూర్‌ పర్యటనకు   ముగ్గురు ఉపాధ్యాయులు

సింగపూర్‌ పర్యటనకు ముగ్గురు ఉపాధ్యాయులు

ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర పురస్కారాలు అందుకున్న ముగ్గురు ఉపాధ్యాయులు సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్‌ విద్యావ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఉత్తమ విద్యావ్యవస్థగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో అత్యుత్తమ విద్యావిధానాలను అధ్యయనంచేసి... వాటిని మన రాష్ట్రంలోకూడా అమలుచేసి మన విద్యావ్యవస్థను మరింత మెరుగుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్‌ పంపిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు జడ్పీహెచ్‌ఎ్‌స ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ ఎన్‌.సుబ్రమణ్యశర్మ, తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్‌ స్కూల్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కయ్యూరు బాలసుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మండలం ఎగువ వీధి జడ్పీహెచ్‌ఎ్‌స ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఎస్‌.రామకృష్ణ సింగపూర్‌ వెళ్లేవారిలో ఉన్నారు. ఈనెల 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు వీరి పర్యటన కొనసాగనుంది. సింగపూర్‌లోని ప్రధాన పాఠశాలల్లో అత్యాధునిక బోధనా విధానాలు, క్లాస్‌రూమ్‌ వాతరావరణం, టెక్నాలజీ ఆధారిత బోధనా విధానాలు, బోధనేతర పద్ధతులు, కరిక్యులం, తరగతి గదుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం తదితర అంశాలను పరిశీలించి తదుపరి ఆయా అంశాల గురించి, రాష్ట్రంలో ఆయా విధానాలను ఎలా అమలు చేయొచ్చన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

కాణిపాకం కిటకిట

కాణిపాకం కిటకిట

కాణిపాక వరసిద్ధి వినాయక స్దామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది.సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూ కట్టడంతో ఆలయంలోని క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి వెలుపల వందల సంఖ్యలో భక్తులు వేచి వుండాల్సివచ్చింది.

సిబ్బంది లేక ఇబ్బంది

సిబ్బంది లేక ఇబ్బంది

విద్యుత్‌ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్‌ సరఫరా లేదని ఫిర్యాదు చేస్తే సిబ్బంది వచ్చి సరిచేసేపాటికి రోజుల సమయం పడుతోంది.

పద్మావతి ఆస్పత్రి మెడికల్‌ షాపు మూత

పద్మావతి ఆస్పత్రి మెడికల్‌ షాపు మూత

శ్రీపద్మావతి ఆస్పత్రి వద్ద నామమాత్రపు అద్దెతో గడువు తీరిపోయినప్పటికీ పొడిగింపుతో కొనసాగుతున్న వైసీపీ వర్గీయుల మెడికల్‌ షాపును టీటీడీ రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు.

తిరుమలేశుడి సేవలో నటి నిక్కీ

తిరుమలేశుడి సేవలో నటి నిక్కీ

సినీ నటి నిక్కీ గల్రానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.

టైమ్స్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూకు చోటు

టైమ్స్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూకు చోటు

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీ యూనివర్సిటీకి చోటు దక్కింది. ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ ర్యాంకింగ్స్‌లో 601-800 మధ్య ర్యాంకు సాధించింది.

28 నుంచి సుందరకాండ పారాయణం

28 నుంచి సుందరకాండ పారాయణం

లోకకల్యాణం కోసం ఈ నెల 28 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు తిరుమలలోని వసంతమండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం నిర్వహించనున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి