Share News

ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:09 AM

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్ల ప్రోత్సాహకాలు మంజూరు చేసిందని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ కృష్ణకిశోర్‌ పేర్కొన్నారు.

ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి ప్రోత్సాహకాలు
వర్క్‌షాపులో మాట్లాడుతున్న కృష్ణకిశోర్‌

జనరల్‌ మేనేజర్‌ కృష్ణకిశోర్‌

మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్ల ప్రోత్సాహకాలు మంజూరు చేసిందని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ కృష్ణకిశోర్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో వెండర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం మొదటిరోజు వర్క్‌షాపు నిర్వహించారు. కృష్ణకిశోర్‌ మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీ పెరుగుదలలో ప్రధానపాత్ర పోషిస్తున్న ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి ఆర్‌ఏఎంపీ ప్రోగ్రాం అమలు చేస్తున్నామన్నారు. ఉద్యం యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, ఇందులో వ్యాపారం, టర్నోవర్‌ వివరాలు నమోదు చేయాలని అన్నారు. ఎంఎస్‌ఎంఈ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటకృష్ణ మాట్లాడుతూ వర్క్‌షాపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిశ్రమశాఖ ఏడీ పవన్‌కమార్‌, కెనరా బ్యాంకు మేనేజర్‌ కమలనాథుడు, డైరెక్టర్‌ శ్రీధర్‌, ప్రిన్సిపాల్‌ రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:09 AM