Share News

వచ్చే ఎన్నికల్లో 2024కు మించిన విజయం రావాలి,

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:58 AM

చిత్తూరు జిల్లాలో 2024కు మించిన విజయం 2029 ఎన్నికల్లో రావాలి. ఆ మేరకు అంతా కలిసి పనిచేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్‌, ఎస్పీలతో శుక్రవారం సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి అంశాల గురించి.. ప్రజాప్రతినిధుల, అధికారుల పనితీరు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాదరెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, గురజాల జగన్మోహన్‌, పులివర్తి నాని, మురళీమోహన్‌, థామస్‌, గాలి భానుప్రకా్‌షతో పాటు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌ పాల్గొన్నారు.

  వచ్చే ఎన్నికల్లో 2024కు మించిన విజయం రావాలి,
సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

చిత్తూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు జిల్లాలో 2024కు మించిన విజయం 2029 ఎన్నికల్లో రావాలి. ఆ మేరకు అంతా కలిసి పనిచేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్‌, ఎస్పీలతో శుక్రవారం సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి అంశాల గురించి.. ప్రజాప్రతినిధుల, అధికారుల పనితీరు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాదరెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, గురజాల జగన్మోహన్‌, పులివర్తి నాని, మురళీమోహన్‌, థామస్‌, గాలి భానుప్రకా్‌షతో పాటు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌ పాల్గొన్నారు.

నేను, అమర్నాథ్‌రెడ్డే సీనియర్లు

‘నేను, అమరనాథరెడ్డి తప్ప మిగిలిన వారంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మీరు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి. ప్రజల్లో కలిసిపోయి వారి సమస్యలు పరిష్కరించాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉండే విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దు’ అని సూచించారు.

ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్‌

వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న సర్వేల ఆధారంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను సీఎం ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సీల్డ్‌ కవర్‌లో రిపోర్టును ఇచ్చారు. బాగా పనిచేసిన వారిని అభినందించి, వెనుకబడినవారికి పలు సూచనలు చేశారు.

చిత్తూరులో రైల్వే బ్రిడ్జి కావాలి

చిత్తూరులో కొత్త రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ సీఎంను కోరగా, ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. చిత్తూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అడవిపల్లె రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వసతుల కల్పన పూర్తి చేయాలని సూచించారు.

ఎమ్మెల్యేల అభిప్రాయాలు

జిల్లాలో ఎకనమిక్‌ యాక్టివిటీ పెంచేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సీఎం సేకరించారు. ఎలక్ర్టానిక్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అనువైన భూములు, కనెక్టివిటీ ఉందని ఎమ్మెల్యేలు తెలిపారు. పరిశ్రమలు, హెల్త్‌ సెంటర్లు, రోడ్డు ప్రమాదాలు, స్వర్ణ కార్యాలయాల సేవలు, ఆర్టీసీ సర్వీసులు, తాగునీరు సహా అనేక అంశాలపై వచ్చిన నివేదికలపై అధికారులతో, ఎమ్మెల్యేలతో చర్చించారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.

ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ కలిసి....

స్థానికంగా ఉన్న ఉత్పత్తులు, వాటికి అనుగుణంగా తీసుకురాదగిన పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో క్రీడా పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దామని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ కలిసి వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన బ్లూప్రింట్‌తో తన వద్దకు రావాలని సీఎం సూచించారు.

అధికారుల పనితీరుపైనా నివేదికలు

ప్రజాప్రతినిధుల పనితీరుతో పాటు అధికారుల పనితీరుపైనా నివేదికలు తెప్పించుకున్నానని సీఎం చెప్పారు. సమన్వయం విషయంలో ఎక్కడ లోపమున్నా ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని.. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రజల వద్దకు వెళితే పాజిటివ్‌ ఫలితాలు వస్తాయని సూచించారు. జిల్లా అధికారులు అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. అలాగే లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో మరింత కఠినంగా ఉండాలని ఎస్పీ తుషార్‌కు సీఎం సూచించారు.

నగరిలో టెక్స్‌టైల్‌ పార్క్‌

నగరిలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు కసరత్తు చేయాలని సీఎంవో అధికారి కార్తికేయ మిశ్రాకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అలాగే, గాలేరు- నగరి ప్రాజెక్టు పనులు చేపట్టి నగరి నియోజకవర్గానికి నీటిని అందించే విషయమై అధ్యయనం చేయాలని సీఎంవో అధికారి రాజమౌళికి సీఎం అప్పగించారు. కోసలనగరం పారిశ్రామికవాడకు నీళ్లందించే విషయం చూడాలని.. ఈ రెండింటికి కలిపి ఎన్ని టీఎంసీల జలాలు అవసరమవుతాయో అంచనా వేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 14 , 2026 | 01:58 AM