Share News

ఆత్మీయ ఆతిథ్యం

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:01 AM

చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తమ నివాస ఆవరణలో మంత్రి నారా లోకేశ్‌ ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటుచేశారు.

ఆత్మీయ ఆతిథ్యం
ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ కుమారుడు, ఎమ్మెల్యే మురళీమోహన్‌ కుమార్తెతో లోకేశ్‌

చిత్తూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తమ నివాస ఆవరణలో మంత్రి నారా లోకేశ్‌ ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటుచేశారు. కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. వార పిల్లలతో సరదాగా గడిపారు. అంతా ఒకే చోట కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. సమస్యలకు, ప్రగతి పనులకు సంబంధించి తనకు ఇచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో ఓ నివేదికను తయారుచేసి ఆయా ప్రజాప్రతినిధులకు లోకేశ్‌ అందించారు. విందు పూర్తయ్యాక అతిథులను గేటు వరకు వెళ్లి సాగనంపారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఒంటరిగా హాజరుకాగా, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్‌, థామస్‌, మురళీమోహన్‌, పులివర్తి నాని, గురజాల జగన్మోహన్‌ కుటుంబీకులతో వెళ్లారు.

Updated Date - Feb 14 , 2026 | 02:01 AM