Share News

తీరప్రాంతాలకు వర్షసూచన

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:04 PM

తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల తీరప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.

 తీరప్రాంతాలకు వర్షసూచన
Rains, IMD

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల తీరప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి... ఉత్తర కర్ణాటక నుంచి రాష్ట్రం మీదుగా మన్నార్‌వలైకుడ వరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది. ఈ కారణం గా, పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాలు, దక్షిణ జిల్లాల సముద్రీతీరప్రాంతాల్లో మంగళ, బుధవారా ల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.


nani3.2.jpgరాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుంది. రాష్ట్రంలోని అంతర్‌ జిల్లాల్లో ఈ నెల 23వ తేది వరకు ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటూ గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

విజయ్‌కు నీరా‘జనం’

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

Read Latest Telangana News and National News

Updated Date - Apr 21 , 2026 | 12:04 PM