Share News

తమిళనాడులోని ఐదు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:49 PM

తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది.

తమిళనాడులోని ఐదు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
Rains, imd, chennai

చెన్నై: రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. మదురై, తేని, దిండుగల్‌, విరుదునగర్‌, శివగంగ తదితర జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా... దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మన్నార్‌గల్ఫ్‌ వరకు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో బలహీనమైన అల్పపీడన ద్రోణి నెలకొని ఉంది.


naniq1.2.jpgదాని కారణంగా, రానున్న 48 గంటల్లో ఐదు జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. దక్షిణ జిల్లాలు, అంతర్గత జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొని, గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశముంది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25-26 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఢిల్లీలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..

ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కీలక నిర్ణయం..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 12:49 PM