Share News

ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ పదవికి రాజీనామా

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:20 AM

ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హరీశ్‌ రావత్‌ పీఏగా పనిచేసిన వ్యక్తి ఉద్యోగ నియామకాల అవకతవకల కేసులో పట్టుబడటంతో.. పార్టీకి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో రావత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ పదవికి రాజీనామా
Harish Rawat Resigns

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) పదవికి ఆయన రాజీనామా చేశారు. 2016లో ఉత్తరాఖండ్‌ సర్వీస్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఉద్యోగ నియామకాలలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆయన మాజీ పీఏ చందన్‌ సింగ్‌ జీనా పట్టుబడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ సేవక్‌ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను టాంపర్‌ చేశారనే ఆరోపణలు జీనాపై ఉన్నాయి. 2014 నుంచి 2017 మధ్య హరీశ్‌ రావత్‌ సీఎంగా ఉన్న సమయంలో జీనా ఆయన ఓఎస్డీగా పనిచేసినట్లు సమాచారం. అనంతరం పీఏగా కూడా వ్యవహరించారు.


ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. జీనా నుంచి రూ.32 లక్షల బ్లాక్‌ మనీ, 200 గ్రాముల గోల్డ్‌ కాయిన్స్‌, 12 లగ్జరీ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైంది. అభ్యర్థుల అసలు ఓఎంఆర్‌ షీట్లను ఇంటికి తీసుకెళ్లి, వాటి స్థానంలో సమాధానాలు నింపిన షీట్లను పెట్టి ఉద్యోగాలు ఇప్పించారనే ఆరోపణలు జీనాపై ఉన్నాయి. తన పీఏ అరెస్టు.. ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే తాను పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు హరీశ్‌ రావత్‌ వెల్లడించినట్లు సమాచారం. అయితే తన పీఏపై వచ్చిన ఆరోపణలను తాను నమ్మలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

‘సూపర్‌ సిక్స్‌’తో ఆర్థిక భద్రత

హాలు బయటే కలెక్టర్ల సెల్‌ఫోన్లు

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 12 , 2026 | 12:36 PM