Share News

సూపర్‌ సిక్స్‌’తో ఆర్థిక భద్రత

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:07 AM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అమ లు చేస్తున్న ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలతో ప్రజలకు ప్రత్య క్ష ప్రయోజనం చేకూరుతోందని అధికారులు తెలిపా రు. సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సు రెండవ రోజు.. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు, ఆర్థిక ప్రగతి, భవిష్యత్‌ కార్యాచరణపై సంబంధిత శాఖల కార్యదర్శులు వివరించారు.

సూపర్‌ సిక్స్‌’తో   ఆర్థిక భద్రత
SUPERSIX

పథకాల తీరుతెన్నులు వివరించిన..

వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అమ లు చేస్తున్న ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలతో ప్రజలకు ప్రత్య క్ష ప్రయోజనం చేకూరుతోందని అధికారులు తెలిపా రు. సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సు రెండవ రోజు.. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు, ఆర్థిక ప్రగతి, భవిష్యత్‌ కార్యాచరణపై సంబంధిత శాఖల కార్యదర్శులు వివరించారు.

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌: రైతు పెట్టుబడి అవసరాలను తీర్చడంతోపాటు సాగుకు ఆర్థిక తోడ్పాటును అందిస్తోందని వ్యవసాయ శాఖ సంచాలకుడు మనజీర్‌ జీలానీ సమూన్‌ వివరించారు. రాష్ట్రంలోని అర్హులైన భూ యజమానులు, ఆర్‌వోఎ్‌ఫఆర్‌ భూములను సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతోందన్నారు. 2025-26లో మూడు విడతలుగా దాదాపు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ.8,985. 41 కోట్లు అందించామని చెప్పారు. 2026-27 ఖరీఫ్‌ సీజన్‌లో ఒక్కో రైతు కుటుంబానికి 7,000 చొప్పున 46.86 లక్షల కుటుంబాలకు రూ.3,125.47 కోట్లు అందించామన్నారు. ఇప్పటివరకు రూ.12,110.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.8,903.10 కోట్లు, కేంద్రం(పీఎం-కిసాన్‌) వాటా రూ.3,207.78 కోట్లు ఉందన్నారు.


స్త్రీ శక్తి: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు సురక్షితమైన ఉచిత ప్రజా రవాణా కల్పించడమే లక్ష్యంగా ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేస్తున్నామని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. 2025, ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.3,267 కోట్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు, బాలికలు ప్రయాణిస్తున్నారని తెలిపారు.

దివ్యాంగ శక్తి: దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకుంటున్నట్టు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి 18న ప్రారంభమైన ఈ పథకం అన్ని స్త్రీ శక్తి కేటగిరీ ఆర్టీసీ బస్సుల్లో అమలవుతోందన్నారు. 2026-27లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.62.71 కోట్ల మేరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు 75.31 లక్షల మంది దివ్యాంగులు వినియోగించుకున్నారని చెప్పారు. రోజుకు సగటున 46 వేల మంది దివ్యాంగులు ప్రయాణిస్తున్నారని, రోజువారీ వ్యయం రూ.17.57 లక్షలుగా ఉందన్నారు.

ఆటో డ్రైవర్‌ సేవలో: సొంత ఆటో, క్యాబ్‌లపై ఆధారపడి జీవించే డ్రైవర్ల జీవనోపాధికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘ఆటో డ్రైవర్‌ సేవలో’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కోన శశిధర్‌ తెలిపారు. వాహన నిర్వహణ, బీమా, ఇతర నిర్వహణ ఖర్చులకు ప్రతి లబ్ధిదారుడికీ ఏడాదికి రూ.15,000 అందిస్తున్నట్టు చెప్పారు. 2025-26లో 3,23,375 దరఖాస్తులు అందగా, 2,90,669 మందిని అర్హులుగా గుర్తించి మొత్తం రూ.436 కోట్లు అందించామన్నారు. వీరిలో 2,64,197 మంది ఆటో డ్రైవర్లకు రూ.396.29 కోట్లు, 20,072 మోటార్‌ క్యాబ్‌ డ్రైవర్లకు రూ.30.10 కోట్లు, 6,400 మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు రూ.9.60 కోట్ల మేర సాయం అందించినట్టు వివరించారు.


దీపం-2: అర్హులైన మహిళలకు వంటగ్యాస్‌ సబ్సిడీ అందించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘దీపం-2’ పథకాన్ని అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ఇప్పటివరకు రూ.3,942 కోట్లు సబ్సిడీగా విడుదల చేశామన్నారు. మొత్తం 1.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రస్తుతం 6వ విడత(ఆగస్టు-నవంబరు-2026) అమలులో ఉండగా, ఇప్పటి వరకు 41.83 లక్షల గ్యాస్‌ డెలివరీలకు రూ.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

తల్లికి వందనం: ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 1 నుంచి 12 వరకు చదువుతున్న విద్యార్థుల ప్రవేశం, కొనసాగింపు, అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. 2026- 27లో మొత్తం 68,05,791 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించి, వీరిలో ఫేజ్‌-1 కింద 64,76,590 మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.9,714.88 కోట్లు మేర నిధులు జమచేశామన్నారు. ఫేజ్‌-2లో 3,29,201 మంది విద్యార్థులకు రూ.493.80 కోట్లు అందించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

Updated Date - Sep 12 , 2026 | 06:07 AM