హాలు బయటే కలెక్టర్ల సెల్‌ఫోన్లు
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:27 AM
జిల్లా కలెక్టర్లకూ నియంత్రణ తప్పలేదు. వెలగపూడి సచివాలయంలో రెండోరోజైన శుక్రవారం జరిగిన సదస్సులో కలెక్టర్ల సెల్‌ఫోన్లను హాలు బయటే కలెక్టు చేశారు. ల్యాప్‌టాప్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు.
సమావేశంలోకి తీసుకురాకుండా కట్టడి
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్లకూ నియంత్రణ తప్పలేదు. వెలగపూడి సచివాలయంలో రెండోరోజైన శుక్రవారం జరిగిన సదస్సులో కలెక్టర్ల సెల్‌ఫోన్లను హాలు బయటే కలెక్టు చేశారు. ల్యాప్‌టాప్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అవి కూడా సదస్సులో సీఎం చంద్రబాబు ఇచ్చే ఆదేశాలను నోట్సుగా ఫీడ్ చేసుకోడానికి మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు ఎవరైనా సమావేశంలోకి సెల్‌ఫోన్లు తీసుకువస్తే వాటిని బయటకు పంపేయాలని చెప్పారు. గురువారం నాటి సదస్సులో చాలామంది కలెక్టర్లు మొబైల్ ఫోన్లు వాడుతూ బిజీగా కనిపించారు. అందుకేనేమో శుక్రవారం కలెక్టర్లకు ఫోన్లను దూరం చేశారని అనుకుంటున్నారు.