భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:15 AM
వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతతో గంగవరం మళ్లీ ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లింది. మండలాల వారీగా.. బంగారుపాళ్యం, తవణంపల్లె, గంగవరంలో 42.8, శ్రీరంగరాజపురంలో 42.0, పాలసముద్రంలో 41.8, పెద్దపంజాణిలో 41.6, నగరి, గుడిపాలలో 40.8, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, పలమనేరులో 40.4, నిండ్ర, పెనుమూరు, వెదురుకుప్పంలో 40.3, పూతలపట్టులో 40.1, ఐరాల, పులిచెర్ల, రొంపిచెర్లలో 40.0, గంగాధర నెల్లూరులో 39.5, యాదమరి లో 39.0, రామకుప్పం, శాంతిపురంలో 38.7, బైరెడ్డిపల్లెలో 38.5, కుప్పంలో 37.5, వి.కోటలో 37.2, గుడుపల్లెలో 36.8, కార్వేటి నగరంలో 36.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి:
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!
Read Latest Telangana News and National News