పారిశ్రామిక దిగ్గజం జీఎన్ నాయుడు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:00 AM
రీజెన్సీ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎన్ నాయుడు మృతిపై ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రీజెన్సీ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎన్ నాయుడు మృతిపై ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘జీఎన్ నాయుడు 1983లో యానాంలో సిరామిక్స్ పరిశ్రమ స్థాపించారు. పరిశ్రమ ద్వారా అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి జీఎన్ నాయుడు చేసిన సేవలు గొప్పవి. నాయుడు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.
కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జీఎన్ నాయుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అల్లుడు నరాల సత్యేంద్ర ప్రసాద్ రీజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కుమార్తెలు రాధిక, బిందు సంస్థల డైరెక్టర్లుగా ఉన్నారు. మే 2వ తేదీన జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జీఎన్ నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు..
పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళ్లాలి: డీజీపీ శివధర్ రెడ్డి