తీరం దాటిన తీవ్ర వాయుగుండం
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:42 AM
వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటింది.
నేడు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు
తిరుపతిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
విశాఖపట్నం, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటింది. తర్వాత పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇంకా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉత్తరాంధ్రలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. తిరుపతిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. కాగా, బుధవారం రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News