పీవోకేలో పాక్ సైన్యం కాల్పుల్లో 20మంది మృతి
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:24 AM
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్ ప్రాంతంలో స్థానిక ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు, పౌరులపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపింది.
న్యూఢిల్లీ, జూలై 28: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్ ప్రాంతంలో స్థానిక ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు, పౌరులపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపింది. నిరసనకారులపై విచక్షణారహితంగా సాగించిన కాల్పుల్లో గత 24 గంటల్లో 20మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.