Share News

మతం మారిన క్రైస్తవులు రిజర్వేషన్లు వదులుకోవాలి: వీహెచ్‌పీ

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:26 AM

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మతం మారిన క్రైస్తవులు రిజర్వేషన్లు వదులుకోవాలని వీహెచ్‌పీ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి డిమాండ్‌ చేశారు. లేదంటే క్రైస్తవ మతాన్ని వీడాలన్నారు. దళిత క్రైస్తవులు అంటూ కొత్త పదం

మతం మారిన క్రైస్తవులు రిజర్వేషన్లు వదులుకోవాలి: వీహెచ్‌పీ

హైదరాబాద్‌, జులై 28 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మతం మారిన క్రైస్తవులు రిజర్వేషన్లు వదులుకోవాలని వీహెచ్‌పీ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి డిమాండ్‌ చేశారు. లేదంటే క్రైస్తవ మతాన్ని వీడాలన్నారు. దళిత క్రైస్తవులు అంటూ కొత్త పదం నిర్వచించడం రాజ్యాంగ విరుద్థమని వివరించారు. విద్యా, ఉద్యోగ రంగాలలో హిందూ సర్టిఫికెట్‌ ద్వారా లబ్ధి పొందిన క్రైస్తవులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత క్రిస్టియన్లు అంటూ కొత్త పదాన్ని తీసుకువచ్చి మతమార్పిడిని ప్రోత్సహిస్తున్న వారికి బుద్థి చెప్పే విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 07:26 AM