Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నవంబర్ 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:28 PM

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నవంబర్ 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం
Andhra Pradesh Weather

అమరావతి, నవంబర్ 11: దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం (నవంబర్ 13) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం (నవంబర్ 14) నాటికి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.


దీని ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఇది ఎటువైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత రానుందని చెప్పారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

నెల్లూరులో భూముల స్కాం.. మేకపాటి రాజగోపాల్‌పై కేసు నమోదు

ఏపీకి రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు.. 24 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: ఎంపీ విజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 01:29 PM