Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:44 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం
cyclone in bay of bengal rain alert for ap

అమరావతి, అక్టోబర్ 23: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఈ మేరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం అక్టోబర్ 24 వరకు తీవ్రరూపం దాల్చి.. వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇది అక్టోబర్ 25 వరకు మరింత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో అక్టోబర్ 26, 27, 28, 29వ తేదీల్లో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. రాబోయే ఈ తుఫానుకు ‘అర్నబ్’ (బెంగాళీ భాషలో మహాసముద్రం) అని నామకరణం చేసినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు డీలా..!

తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 07:40 PM