Share News

రెయిన్ అలర్ట్.. మరో మూడు గంటల్లో ఏపీలో వర్షాలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:35 PM

వాతావరణంలో ఏర్పడిన పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.

 రెయిన్ అలర్ట్.. మరో మూడు గంటల్లో ఏపీలో వర్షాలు
AP Rain Alert

అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో ఏర్పడిన పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.


విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. పల్నాడు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. పొన్నూరు, తెనాలి ప్రాంతాల్లో మోస్తరు వర్ష సూచన ఉందని వెల్లడించారు. వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

Updated Date - Sep 08 , 2026 | 03:01 PM