భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్‌ కోసం జగన్‌ పాట్లు

ABN, Publish Date - Jul 31 , 2026 | 01:38 PM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. విమానాశ్రయం పూర్తిగా తన హయాంలోనే ప్రారంభమైందన్నట్లుగా ప్రచారం చేస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. విమానాశ్రయం పూర్తిగా తన హయాంలోనే ప్రారంభమైందన్నట్లుగా ప్రచారం చేస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోగాపురం విమానాశ్రయానికి 2019లోనే సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. భోగాపురం ఎయిర్‌పోర్టును అడ్డుకుంటామని కూడా ప్రకటించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులను వేగవంతం చేసి, రెండేళ్ల వ్యవధిలోనే విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి స్థాయికి తీసుకొచ్చింది. దీంతో భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌పై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: పట్టుదలే పతకమైంది.. డిస్కస్ త్రోలో సీమా కళిరామన్‌కు కాంస్యం

దులీప్ ట్రోఫీ.. వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ ఎలా చేశారు?: హర్షా భోగ్లే

Updated at - Jul 31 , 2026 | 01:39 PM