వివేకా కేసులో సీబీఐ విచారణపై జగన్ ఎందుకు వెనక్కి తగ్గారు.?

ABN, Publish Date - Oct 07 , 2026 | 07:28 AM

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణపై మాజీ సీఎం జగన్ ఎందుకు వెనక్కు తగ్గారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ ప్రశ్నించారు.

ఇంటర్నెట్ డెస్క్: మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణపై ఎందుకు వెనక్కు తగ్గారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ వ్యవహారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బయటకు తీస్తోందని, నిందితుల నుంచి మనీ ట్రైల్ ఆధారాలు వెలుగుచూస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Updated at - Oct 07 , 2026 | 07:28 AM