తమిళనాడులో కార్తీక దీపం వివాదం.. తిరుపరంకుండ్రం కొండపై 5 వేల మంది పోలీసులతో బందోబస్తు

ABN, Publish Date - Nov 24 , 2026 | 01:17 PM

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురై తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం వేళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపరంకుండ్రం కొండపై దర్గాకు సమీపంలో ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించే అంశం.. వివాదానికి దారితీయడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మధురై జిల్లావ్యాప్తంగా సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. కొండ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. సుమారు 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తిరుపరంకుండ్రంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated at - Nov 24 , 2026 | 01:18 PM