కేంద్రమంత్రివర్గంలో మార్పులు.. టీడీపీ నుంచి మరొకరికి ఛాన్స్ ..!?

ABN, Publish Date - Jun 02 , 2026 | 11:01 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగనున్నట్లు భావిస్తున్న పునర్వ్యవస్థీకరణలో టీడీపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగనున్నట్లు భావిస్తున్న పునర్వ్యవస్థీకరణలో తెలుగుదేశం పార్టీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా, కేంద్రమంత్రి వర్గంలో భారీ మార్పులు తప్పవన్న ప్రచారం ఊపందుకుంది. కనీసం ఐదారుగురు కేబినెట్ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో కొందరికి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని.. ఈనెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర అధ్యక్షులతో చర్చలు జరిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Jun 02 , 2026 | 11:12 AM