సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ

ABN, Publish Date - May 10 , 2026 | 03:16 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు (ఆదివారం) తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతల ఇళ్లకు మర్యాదపూర్వకంగా వెళ్లి పలు అంశాలపై ప్రధాని చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, పలు రాజకీయ అంశాలపై ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది.

Updated at - May 10 , 2026 | 03:34 PM