Share News

పాపడ్‌కి సబ్జీ.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:29 PM

పాపడ్‌కి సబ్జీ.. తయారీకి కావాల్సినవి..అప్పడాలు - అయిదు, పెరుగు - కప్పు నెయ్యి - స్పూను, జీలకర్ర - స్పూను, ఇంగువ - కాస్త, కారం - స్పూను, పసుపు - అర స్పూను, ధనియాల పొడి - స్పూను

పాపడ్‌కి సబ్జీ.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..
Vantalu

కావలసిన పదార్థాలు: అప్పడాలు - అయిదు, పెరుగు - కప్పు నెయ్యి - స్పూను, జీలకర్ర - స్పూను, ఇంగువ - కాస్త, కారం - స్పూను, పసుపు - అర స్పూను, ధనియాల పొడి - స్పూను, ఉప్పు - తగినంత, నీళ్లు - రెండు కప్పులు, కొత్తిమీర - కాస్త.


book9.2.jpgతయారుచేసే విధానం: అప్పడాలను మీడియం సైజులో ముక్కలుగా చేసుకోవాలి. ఓ గిన్నెలో పెరుగుని గిలక్కొట్టాలి. అందులో పసుపు, ధనియాల పొడి, కారం, కాస్త నీళ్లను కలిపి జారుగా చేసుకోవాలి. ఓ పాన్‌లో నెయ్యి వేసి జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడించాలి. ఇందులో పెరుగు మిశ్రమాన్ని వేసి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. అవసరమైతే నీళ్లని కలపొచ్చు. అంతా దగ్గరకి అవుతుంటే అప్పడాల ముక్కలను చేర్చి, కాసేపు ఉడికించి స్టవ్‌ కట్టేయాలి. పైన కొత్తిమీర చల్లితే రాజస్థానీ పాపడ్‌కి సబ్జీ నోరూరిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

తొలి లడ్డూ ‘కసార’

మరవలేని మన ‘డిటెక్టివ్‌’...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 12:38 PM