మఖానా ఛాట్.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:10 PM
మఖానా ఛాట్.. తయారీకి కావాల్సినవి...మఖానా - రెండు కప్పులు, నెయ్యి - స్పూను, ఛాట్ మసాల - అర స్పూను, ఉప్పు - పావు స్పూను.
కావలసిన పదార్థాలు: మఖానా - రెండు కప్పులు, నెయ్యి - స్పూను, ఛాట్ మసాల - అర స్పూను, ఉప్పు - పావు స్పూను, వేయించిన జీలకర్ర - అర స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, టమాటా, కీరా ముక్కలు - అర కప్పు, దానిమ్మ గింజలు - రెండు స్పూన్లు, నిమ్మరసం - స్పూను, కొత్తిమీర తరుగు - స్పూను, వేయించిన పల్లీలు - స్పూను.
తయారుచేసే విధానం: ఓ పాన్‌లో కాస్త నెయ్యి వేసి మఖానాను అయిదు నిమిషాల పాటు కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి. ఓ కప్పులో చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం కలుపుకోవాలి. ఓ పెద్ద కప్పులో మఖానా, టమాటా, కీరా ముక్కలు, దానిమ్మ గింజలు, పల్లీలు, ఛాట్ మసాలా మిశ్రమం జతచేసి మొత్తం కలిపి, పైన కొత్తిమీర తరుగు వేస్తే మఖానా ఛాట్ సిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News