మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:47 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ కోతికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Monkey Viral Video).
suchit.dixit.39 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కోతి సైకిల్ చక్రం నుంచి ట్యూబ్‌ను చాలా జాగ్రత్తగా బయటకు తీస్తోంది. అది చేస్తున్న తీరు చూస్తే నిజంగా పంక్చర్ వేసే అనుభవం ఉన్న మెకానిక్‌లా కనిపిస్తోంది. అక్కడే ఉన్న వ్యక్తి ఈ దృశ్యాన్ని తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Bicycle Puncture Monkey).
ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Monkey Mechanic). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఆరు లక్షల మంది వీక్షించారు. 39 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'అల్లరి చేస్తే పొట్ట నిండదు.. పని చేయాల్సిందే', 'ఈ రోజు పని చేస్తేనే రేపు తినగలడు' అంటూ నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..
ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..