Share News

నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్‌టీఏ

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:23 AM

నీట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఈ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ది బెస్ట్ చెప్పింది.

నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్‌టీఏ
NEET UG 2026

న్యూఢిల్లీ, జూన్ 21: నీట్ (NEET- UG 2026) పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఈ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది.

  • పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం ఉదయం 11:00 గంటలకు ప్రారంభం.

  • మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు.

  • అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు వెంట ఉండాలి.

  • నిషేధిత వస్తువులకు అనుమతి లేదు. ట్రాఫిక్ దృష్ట్యా ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి.

  • పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు నోట్స్‌కు అనుమతి లేదు.

  • డ్రెస్ కోడ్ హాఫ్ స్లీవ్స్, చెప్పులు మాత్రమే వేసుకోవాలి. జీన్స్, షూస్‌తోపాటు ఆభరణాలు నిషిద్ధం.


NEET-UG పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు ముందే ప్రశ్న పత్రం లీక్ అయినట్లు గుర్తించింది. దాంతో ఈ పరీక్షను రద్దు చేసింది. మళ్లీ ఈ పరీక్షను ఈ రోజు (జూన్ 21వ తేదీ) నిర్వహిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ కోర్సులకు ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్షను చేపట్టనున్నారు. పెన్ అండ్ పేపర్ మోడ్, ఆఫ్‌ లైన్‌లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.


తెలంగాణలో ఈ పరీక్షను 72,956 మంది విద్యార్థులు రాయనున్నారు. అందుకోసం 208 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రశ్నాపత్రాల రవాణాకు తొలిసారిగా ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ సహాయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా 5,432 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.


ఈ పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల ముందే విద్యార్థులు.. ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం 2 లక్షల మందికిపైగా సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద సీసీ టీవీ1.38 లక్షల కెమెరాలతోపాటు 51,311 జామర్లు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

RRB ఏఎల్‌పీ ఉద్యోగాల కోసం అప్లై చేశారా? ఈ అప్‌డేట్ మీ కోసమే

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు జై

For More Education News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 09:12 AM