RRB ఏఎల్‌పీ ఉద్యోగాల కోసం అప్లై చేశారా? ఈ అప్‌డేట్ మీ కోసమే
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:10 PM
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్లికేషన్ ఫారమ్‌లో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్లికేషన్ ఫారమ్‌లో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తులను మే 15 నుంచి జూన్ 14 వరకు స్వీకరించింది. ఇప్పుడు అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది.
అధికారిక షెడ్యూల్ ప్రకారం, జూన్ 17 నుంచి జూన్ 26 రాత్రి 11:59 గంటల వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు తమ అప్లికేషన్‌లోని కొన్ని తప్పులను సరిచేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు వివరాల్లో మార్పులు చేసుకునేందుకు రూ.250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఏ వివరాలను సరిచేసుకోవచ్చు?
అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలు
విద్యార్హతలకు సంబంధించిన సమాచారం
కేటగిరీ లేదా రిజర్వేషన్ వివరాలు
చిరునామా సమాచారం
ఫొటో, సంతకం
ఏ వివరాలను మార్చలేరు?
రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్
ఈమెయిల్ ఐడీ
ఎంపిక చేసిన రైల్వే జోన్
ఎలా సరిచేసుకోవాలి?
ముందుగా ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ లేదా ఆధార్ వివరాలతో లాగిన్ కావాలి.
అప్లికేషన్ మోడిఫికేషన్ లేదా కరెక్షన్ విండో ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
వివరాలను సరిచేసి నమోదు చేయాలి.
నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.
చివరగా సవరించిన అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు జూన్ 26లోపు అప్లికేషన్ ఫారమ్‌లో తప్పులను సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:
ధనవంతులు చేసే పనులు ఇవే.. కీర్తి, డబ్బు సంపాదించాలనుకుంటే ఇలా చేయండి
ముక్కు ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి