పెసరపప్పు కేక్.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు
ABN , Publish Date - May 10 , 2026 | 01:26 PM
పెసరపప్పు కేక్.. తయారీకి కావలసిన పదార్థాలు.. పెసరపప్పు - అర కప్పు, నెయ్యి - అర కప్పు, చక్కెర - అర కప్పు, మైదా పిండి - కప్పు, బేకింగ్ పౌడర్
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, నెయ్యి - అర కప్పు, చక్కెర - అర కప్పు, మైదా పిండి - కప్పు, బేకింగ్ పౌడర్ - అర స్పూను, వెనీలా ఎస్సెన్స్ - స్పూను, బాదం పలుకులు - స్పూను, జీడిపప్పు పలుకులు - స్పూను, టూట్టి ఫ్రూటీ - స్పూను, పసుపు - అర స్పూను.
తయారుచేసే విధానం: అయిదు గంటల పాటు పెసరపప్పును నానబెట్టి, మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఓ గిన్నెలో చక్కెర, నెయ్యి వేసుకుని గిలక్కొట్టాలి. ఇందులో పెసర పప్పు పేస్టు, మైదా, పసుపు, బేకింగ్ పౌడర్, వెనీలా ఎస్సెన్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్ టిన్‌లో వేసి ఓవెన్‌లో 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. కాస్త నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పలుకులు, టూట్టీ ఫ్రూట్టీలను పైన అలంకరించి బేక్ చేయడం మరచిపోవద్దు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..
ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..
Read Latest Telangana News and National News